బైక్‌పై ఐదుగురి ప్రయాణం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్‌కు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో గురుద్వారా బాబా దండియావాలా సమీపంలో వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో
మహిళ గాయపడగా.. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
లారీ వేగంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం కొద్ది అడుగుల దూరం ఎగిరిపడింది. దీంతో ఇద్దరు పిల్లలు సహా దంపతులు రోడ్డుపై ఎగిరిపడడంతో తీవ్ర గాయాలతో మృతి చెందారు. మరో మహిళ సైతం తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పారిపోలేదని, ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

