మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ
తాజా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో పరిస్థితి మరింత క్షీణించింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ హత్యలు నిరసనలకు దారితీయగా ఇంఫాల్ నగరం పూర్తిగా స్తంభించిపోయింది.
- నలుగురి మృతి, పలువురికి గాయాలు
- సీఎం ఇంటి ముందు మృతదేహాలు ఉంచి స్థానికుల నిరసన
ఇంఫాల్, అక్టోబర్ 19 : తాజా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో పరిస్థితి మరింత క్షీణించింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ హత్యలు నిరసనలకు దారితీయగా ఇంఫాల్ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. ఆగ్రహించిన స్థానికులు నిరసనగా రెండు మృతదేహాలను ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఉంచగా అధికారులు వాటిని తొలగించారు. మొదటి ఘటనలో మైతీ, పాంగల్ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగిన ఒక సంగీత కార్యక్రమం సందర్భంగా హింస చెలరేగింది. అక్కడ రాళ్ల దాడి, కాల్పులు చోటుచేసుకోవడంతో గుంపులోని పలువురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన 24 ఏండ్ల యువకుడు ఒకరు ఆ తర్వాత మరణించాడు.
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్లోక్లో జరిగిన మరో ఘటనలో సమీపంలోని కొండల్లోకి కట్టెల కోసం వెళ్లిన ముగ్గురు గ్రామస్థులను గిరిజన మిలిటెంట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో కుకీ మిలిటెంట్ గ్రూపు ఉనికి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ హత్యలు గ్రాస్థులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో వారు మృతదేహాలను తీసుకుని ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి బంగ్లాకు ప్రదర్శనగా వెళ్లారు. లోపలకు చొరబడి శవాలను అక్కడ పడవేయడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, లాఠీచార్జ్‌కు పాల్పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

