వయనాడ్: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డ ఘటనలో.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 323కు చేరుకున్నది. మరో 293 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. ముండక్కై, చూరమాలాలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే ఇవాళ నాలుగో రోజున.. చూరమాలాలోని పడవెట్టికున్న గ్రామంలో ఓ ఇంటి శిథిలాల కింద నలుగుర్ని సజీవంగా గుర్తించారు. ఆ నలుగురిలో ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చూరమాలాకు మూడు కిలోమీటర్ల దూరంలో పడవెట్టికున్న గ్రామం ఉన్నది.
శిథిలాల కింద సజీవంగా చిక్కిన ఆ నలుగురికి చికిత్సను అందించేందుకు ఆర్మీ చర్యలు చేపట్టింది. జానీ అనే వ్యక్తి అక్కడ తోట ఉన్నట్లు స్థాని పంచాయతీ ప్రతినిధిలు తెలిపారు. కొండచరియలు విరిగి భీకర వరదలు వచ్చినట్లు అతని కుటుంబం ఇంట్లోనే దాచుకున్నట్లు కొందరు తెలిపారు. అయితే ప్రాంతానికి చెందిన చాలా మంది ప్రస్తుతం క్యాంపులో తలదాచుకుంటున్నారు. కొండచరియలు విరిగిపడ్డ సమయంలో.. బహుశా వాళ్లు కొండ పైభాగం వైపు పరుగెత్తి ఉంటారని అంచనా వేస్తున్నారు.
వివిధ కేంద్ర బలగాలకు చెందిన సుమారు 1300 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఆరు జోన్లుగా తనఖీ ప్రక్రియ కొనసాగుతున్నది. చూరమాలా, ముండక్కై మధ్య ఆర్మీ నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్‌ను.. అక్కడ శాశ్వత బ్రిడ్జ్‌ను నిర్మించేంత వరకు వాడనున్నారు.