పాట్నా : మరికొద్ది నెలల్లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్‌తో తలపడేందుకు ఒకప్పటి ఆయన సన్నిహితులు ప్రశాంత్ కిశోర్, ఆర్సీపీ సింగ్ చేతులు కలిపారు. కేంద్ర మాజీ మంత్రి సింగ్ తాను ఆర్నెల్ల క్రితం స్థాపించిన ఆప్ సబ్కీ ఆవాజ్ పార్టీని ప్రశాంత్ ఏర్పాటు చేసిన జన సురాజ్ పార్టీలో విలీనం చేశారు.
వీరిద్దరూ ఆదివారం మీడియాతో మాట్లాడారు. సింగ్ మాట్లాడుతూ, బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తామిద్దరమూ కలిసి కృషి చేస్తామన్నారు.