Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
Pinarayi Vijayan : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాకిచ్చింది. సీఎంఎల్ఆర్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 23న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
Pinarayi Vijayan : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాకిచ్చింది. సీఎంఎల్ఆర్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 23న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో కేరళ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ కేసులో మాజీ సీఎం విజయన్‌తోపాటు ఆయన కూతురు వీణా విజయన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేసు విచారణ కోసం కోచిలోని తమ కార్యాలయంలో అక్టోబర్ 23న హాజరు కావాలని విజయన్ను ఈడీ ఆదేశించింది. అయితే, తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ విజయన్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. ఈ ఏడాది మేలో ఈడీ అధికారులు సీఎంఆర్ఎల్ సంస్థ ప్రమోటర్లపై దాడులు జరిపారు. దీనిలో భాగంగా విజయన్ కూతురు వీణా విజయన్ ఇంటిపై కూడా దాడులు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించాయి.
ఇండియా నుంచి భారీ ఎత్తున డబ్బు దుబాయ్, విదేశాలకు తరలించినట్లుగా ఆ డాక్యుమెంట్లలో ఉంది. 3.49 లక్షల యూఏఈ దిర్హామ్స్ (రూ.85 లక్షలు) దుబాయ్‌కు తరలించారు. అలాగే, ఇండియా నుంచి రూ.20.05 కోట్ల భారత కరెన్సీ కూడా విదేశాలకు తరలించారు. హవాలా లావాదేవీల ద్వారా ఈ సొమ్మును విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. విజయన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పాత్రపై కూడా ఈ విషయంలో అనుమానాలున్నాయి. ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎల్ సంస్థకు లబ్ధి చేకూరినట్లుగా ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. పినరయి విజయన్, వీణా విజయన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో తాజాగా పినరయి విజయన్‌కు సమన్లు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

