Angela Merkel | న్యూఢిల్లీ, జూలై 14: జర్మన్ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు కొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. రిటైరైన తర్వాత ఆమె ప్రముఖ జర్మనీ పాపుల్ టీవీ షోలో ఆమె మిస్ మార్పెల్గా డిటెక్టివ్ పాత్రలో అరంగేట్రం చేస్తున్నారు. అగాథా క్రిస్టీ రచించిన మిస్ మార్పెల్లో ఆమె ఆదే పాత్రలో కన్పించబోతున్నారు.
ఆ షోలో ఆమె ఉత్తర ఇటలీలోని నేరాలను పరిశోధించే డిటెక్టివ్‌గా కన్పిస్తారు. డెట్ ఎట్ ద క్యాజెల్ పేరుతో రానున్న తొలి ఎపిసోడ్ ట్రయిలర్ కూడా విడుదలైందని ఆమె తెలిపారు. కాగా రాజకీయాల నుంచి రిటైరైన 69 ఏండ్ల మెర్కెల్ 2005 నుంచి 2021 వరకు జర్మనీలో చాన్స్‌లర్‌గా, 2002 నుంచి 2005 వరకు విపక్ష నేతగా, 2000 నుంచి 2018 వరకు క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్‌కు నేతగా ఉన్నారు.