IPS Sreelekha : కేరళలో అసెంబ్లీ ఎన్నికల (Kerala assembly elections) గడువు మరో ఏడాదిన్నర మిగిలి ఉండగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీల్లో చేరికల పర్వాలు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళ మాజీ డీజీపీ (Former DGP), ఐపీఎస్ అధికారిణి (IPS officer) ఆర్ శ్రీలేఖ (R Sreelekha) బీజేపీ (BJP) లో చేరారు. ఆమె తన భర్తతో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో వారు కాషాయ దళంలో చేరారు.
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖను సురేంద్రన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె మెడలో బీజేప కండువా వేశారు. ఆ తర్వాత సురేంద్రన్ దంపతులకు కమలం పువ్వులను అందజేశారు. ఆ తర్వాత వారికి స్వీట్లు తినిపించారు. ఐపీఎస్ శ్రీలేఖ గతంలో కేరళ డీజీపీగా పనిచేశారు. కాగా కేరళలో 2021 ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2026 ఏప్రిల్ కల్లా ఆ అసెంబ్లీ గడువు ముగియనుంది.
#WATCH | Thiruvananthapuram: Former DGP IPS R Sreelekha along with her husband, Dr Sethunath, joined the BJP today in the presence of Kerala BJP President K Surendran pic.twitter.com/EPvxkJlYHP
— ANI (@ANI) October 9, 2024