Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. లాలూ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని కార్డియాలజిస్టులు మాజీ సీఎంకు సూచించగా ఆయన అంగీకరించారు. ఈ క్రమంలో గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. లాలూ గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో ఆయన సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ స్కామ్, దాణా కుంభకోణం కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆయన నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఈ నెల 10న ఆయన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైద్య పరీక్షల తర్వాత ఒకటి, రెండురోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. 2014లో లాలూకు ఇదే ఆస్పత్రిలో అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. 2018, 2023 అదే ఆసుపత్రిలో పరీక్షల కోసం వచ్చారు. సతోష్ దొరా నేతృత్వంలోని వైద్యబృందం చికిత్స అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 2022లో లాలూ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయనకు కూతురు రోహిణి కిడ్నీ దానం చేశారు. రోహిణి సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. చాలాకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతుండగా.. నిపుణుల సూచన మేరకు కిడ్నీ మార్పిడికి ఆయన అంగీకరించారు. కూతురు రోహిణి కిడ్నీ సరిపోలడంతో సింగపూర్‌లోనే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.