Jai Shankar : అమెరికా సుంకాలు, ఆంక్షల వేళ రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈమధ్యే జాతీయ భద్రతా సలహాదారు అజిద్ ధోవల్ (Ajit Doval) ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం జరిగిన రెండు వారాలలోపే విదేశాంగ శాఖమంత్రి జై శంకర్ (Jai Shankar) రష్యాకు వెళ్లి.. పుతిన్‌ను కలిశారు.
గురువారం ఉదయం ఆ దేశ విదేశాంగ శాఖమంత్రి సెర్గే లవ్రోవ్తో సమావేశమైన ఆయన సాయంత్రం మాస్కోలో అధ్యక్షుడితో భేటీ అయ్యారు. చమురు కొనుగోలు ఒప్పందంపై ప్రధానంగా ఇరువురు చర్చించారని సమాచారం. అయితే.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరల్డ్ లోనే గొప్పగా సుస్థిరంగా కొనసాగిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఏయే అంశాలపై చర్చించారు? అనేది తెలియాల్సి ఉంది.
External Affairs Minister Dr S Jaishankar calls on Russian President Vladimir Putin.
(Source: Officials) pic.twitter.com/7Srx2mCXSP
— ANI (@ANI) August 21, 2025
రష్యా పర్యటనలో జై శంకర్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. మొదట ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గేతో సమావేశమైన ఆయన ఇరుదేశాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వరల్డ్‌లో అత్యంత వేగంగా, సుస్థిరంగా ఏర్పడిన అనుబంధం భారత్, రష్యాలది. ఉమ్మడి లక్ష్యాలతో దేశాలు ముందుకు రావడం, అధినేతలు మాట్లాడుకోవడం.. బలమైన సెంటిమెంట్ వంటికి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలకం అవుతాయి అని జై శంకర్ వెల్లడించారు.
Pleased to meet FM Sergey Lavrov today in Moscow.
Had a detailed discussion on our bilateral ties, including trade, investment, energy, fertilizers, health, skilling & mobility, defense, and people to people exchanges.
We exchanged views on Ukraine, Europe, Iran, West Asia,… pic.twitter.com/2p6WowdnEr
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 21, 2025
సెర్గీతో భేటీ సమగ్రంగా, సంతృప్తికరంగా సాగిందంటూ జై శంకర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఎరువులు, ఆరోగ్యం, రక్షణ..వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చించాం. అంతేకాదు ఇరువురం ఉక్రెయిన్, యూరప్, ఇరాన్, పశ్చిమ ఆసియా, అఫ్గనిస్థాన్‌తో పాటు భారత ఉపఖండం గురించి కూడా ఇద్దరం అభిప్రాయాలు పంచుకున్నాం. అంతేకాదు మా భేటీలో ఐక్యారాజ్య సమితి, జీ20, స్కో (SCO), బ్రిక్స్.. వేదికలపై పరస్పర సహకారంపై కూడా ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాది చివర్లో జరుగబోయే వార్షిక సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడింది అని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.