Case Against Tejasvi Surya | సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్ట్లు.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు
Case Against Tejasvi Surya | సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఈ విషయం తెలిపారు.
బెంగుళూరు: సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. (Case Against Tejasvi Surya) ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఈ విషయం తెలిపారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టు చేస్తున్నారని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శత్రుత్వాన్ని వ్యాప్తి చేశారంటూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. మార్చి 19న ఎక్స్తోపాటు యూట్యూబ్లో ఇలాంటి పోస్టులు చేశారని విమర్శించారు. ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు వర్గాల మధ్య మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఈ ఫిర్యాదు ఆధారంగా ఈసీ చర్యలు చేపట్టింది. మార్చి 20న హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మత విశ్వాసాలను అవమానించడం, హాని కలిగించే చర్యలకు పాల్పడడం వంటి సెక్షన్లు మోపినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

