Woman Killed Father-In-Law | రూ.300 కోట్ల ఆస్తి కోసం.. కోటి ఖర్చు చేసి మామను చంపించిన మహిళ
Woman Killed Father-In-Law | సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్ర పన్నింది. కోటి ఖర్చు చేసి మామను చంపించింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్ర పన్నింది. కోటి ఖర్చు చేసి మామను చంపించింది. (Woman Killed Father-In-Law) పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మే నెలలో 82 ఏళ్ల పురుషోత్తం పుట్టేవార్ భార్యకు సర్జరీ జరిగింది. కోలుకుంటున్న ఆమెను చూసేందుకు పురుషోత్తం ఆసుప్రతికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కారు వేగంగా ఆ వృద్ధుడ్ని ఢీకొట్టి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు మరణించాడు.
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. వృద్ధుడు పురుషోత్తంను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ నిందితుడు వృద్ధుడి కుమారుడి కారు డ్రైవర్‌గా పోలీసులు తెలుసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా వృద్ధుడి కోడలైన 53 ఏళ్ల అర్చనా మనీష్ పుట్టేవార్ ఆస్తి కోసం మామను హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీని కోసం ఆమె కోటి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు డాక్టరైన భర్త మనీష్ కారు డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లతో కలిసి మామ పరుషోత్తం హత్యకు కోడలు అర్చన కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. రోడ్డు ప్రమాదంలో మామ మరణించినట్లుగా నమ్మించేందుకు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయించింది. మామను చంపేందుకు నిందితులకు ఆమె కోటి చెల్లించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన అర్చనతోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

