భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని ఫిబ్రవరి 16న తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నది. దీంతో నేపాలీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. (Nepali Students Protest) ఆమె ఆత్మహత్యకు పురికొల్పిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు.
కాగా, ఉద్రిక్తత నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. క్యాంపస్‌లోని హాస్టల్స్‌ను మూసివేసింది. 500 మందికిపైగా నేపాలీ విద్యార్థులను వారి దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వారిని బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు చేర్చింది. అయితే ఉన్నట్టుండి తమను క్యాంపస్ నుంచి పంపివేయడంపై నేపాల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేని తాము ఎక్కడ ఉండాలని, తమ దేశానికి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.
మరోవైపు జరిగిన సంఘటనపై యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. ఒక వ్యక్తితో వ్యక్తిగత సంబంధం వల్ల నేపాల్‌కు చెందిన మహిళా విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు తెలిపింది. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారని ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. దర్యాప్తు కోసం ఆ విద్యార్థిని మొబైల్ ఫోన్, లాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, కొన్ని గంటల తర్వాత యూనివర్సిటీ మరో ప్రకటన విడుదల చేసింది. క్యాంపస్, హాస్టళ్లలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, విద్యా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యార్థులంతా క్యాంపస్‌కు తిరిగి రావాలని, క్లాసులకు అటెండ్ కావాలని విజ్ఞప్తి చేసింది. అయితే నేపాల్ విద్యార్థుల ఆందోళనలు, వారిని బలవంతంగా బస్సుల్లో పంపుతున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Odisha: A https://t.co/jHgpcuG1h1 third-year girl student from Nepal was found dead in KIIT University (Kalinga Institute of Industrial Technology) hostel in Bhubaneswar on 16th February. As per a notice issued by the University, the institute is hence closed sine die… pic.twitter.com/vVfgY140up
— ANI (@ANI) February 17, 2025
Students also being beaten by security Guardpic.twitter.com/VLsygasuFg
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 17, 2025