Viral Video | రేప్ కేసు నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలు..!
Viral Video | బీహార్ నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి... ఈ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోమని బాలిక తల్లిదండ్రులకు సూచించాడు. దీంతో వారు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. పంచాయతీ పెద్దలు నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి చేతులు దులుపుకున్నారు. అయితే, పంచాయతీ తీర్పుపై పలువురు గ్రామస్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Viral Video | ఎవరైనా వ్యక్తి అత్యాచారానికి పాల్పడితే అధికారులు కఠిన శిక్షలు విధించడం చూస్తుంటాం. కానీ, బీహార్ రాష్ట్రంలో అత్యాచార నిందితుడికి అక్కడ గ్రామ పెద్దలు వింత శిక్ష విధించారు.
బీహార్ నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి… ఈ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోమని బాలిక తల్లిదండ్రులకు సూచించాడు. దీంతో వారు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. పంచాయతీ పెద్దలు నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి చేతులు దులుపుకున్నారు. అయితే, పంచాయతీ తీర్పుపై పలువురు గ్రామస్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ తంతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ మంగ్లా వెల్లడించారు.
बिहार के नवादा में पांच साल की बच्ची से दुष्कर्म के प्रयास और छेड़खानी करने वाले सक्स को पंचायत ने सुनाई 5 बार उठक बैठक की सजा। #Bihar #nawada pic.twitter.com/A08Av0NQjY
— Pratik Bhan (@drpratikbhan) November 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Nawada
- Punishment
- sit-ups
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

