Manipur | మణిపూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం.. భయంతో పరుగులు తీసిన ఓటర్లు
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టించింది.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టించింది. ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని ఓ పోలింగ్ బూత్ (polling booth) వద్ద ఒక్కసారిగా కాల్పులు కలకలం సృష్టించాయి.
తొలి దశ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయిరాంగ్ సెగ్మెంట్లోని థమన్‌పోక్పిలో గల పోలింగ్ స్టేషన్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
కొందరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులకు పాల్పడిన వారికోసం సమీపంలో గాలిస్తున్నారు. కాగా, కాల్పుల ఘటనతో పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
मणिपुर में मतदान केंद्र पर भारी गोलीबारी, कई लोगों के घायल होने की खबर #LokSabhaElections2024#ManipurViolence #Manipur #TSTTPD pic.twitter.com/0CHkFXRxhL
— Uttarakhand Tehelka (@uktehelka24) April 19, 2024
Also Read..
Arvind Kejriwal | నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Polling Percent | అత్యధికంగా త్రిపుర.. అత్యల్పంగా లక్షద్వీప్.. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా
Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

