కొల్హాపూర్: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) సంభవించింది. ఫ్యాక్టరీలో పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ అంతటికి మంటలు విస్తరించాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు.