తిరువనంతపురం: కువైట్(Kuwait)లోని ఆరు అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరుకున్నది. మంగాఫ్ బ్లాక్‌లో ఉన్న బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో మృతిచెందిన వారిలో 24 మంది కేరళ వాసులు ఉన్నట్లు నాన్ రెసిడెంట్ కేరలేట్స్ అఫైర్స్ సంస్థ ప్రకటించింది. దీంట్లో 17 మందిని మాత్రమే గుర్తించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అల్ మంగాఫ్ బిల్డింగ్ అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది మృతిచెందగా, దాంట్లో 42 మంది భారతీయులే అని తేలింది. మిగితావారిలో పాకిస్థానీలు, ఫిలిప్పినో, ఈజిప్ట్, నేపాలీలు ఉన్నారు. కేరళ వాసులతో పాటు తమిళనాడు, యూపీ రాష్ట్రాలకు చెందిన వారు కూడా మరణించిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం 35 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని, అందులో ఏడు మంది క్రిటికల్‌గా ఉన్నట్లు తెలిపారు. కనీసం అయిదుగురు వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నట్లు తేలింది.
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు .. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ .. హుటాహుటిన కువైట్‌కు బయలుదేరి వెళ్లారు. గాయపడ్డ భారతీయులకు సహాయాన్ని అందించేందుకు పనులను పర్యవేక్షించనున్నారు. మరణించిన వారి మృతదేహాలను వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేపట్టనున్నారు. గుర్తుపట్టలేకుండా కాలిపోయిన వారిని పసికట్టేందుకు డీఎన్ఏ టెస్టింగ్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మంగాఫ్ బిల్డింగ్‌లోని ఈజిప్టియన్ సెక్యూర్టీ గార్డు క్వార్టర్స్‌లో వంట గ్యాస్ పేలడం వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అక్కడ మొదలైన మంటలు శరవేగంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించినట్లు పేర్కొన్నారు. బ్లాక్-4లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
బిల్డింగ్ ఓనర్ స్వస్థలం కువైటీ. వేర్వేరు అపార్ట్మెంట్లలో మొత్తం 195 మంది ఉన్నట్లు చెబుతున్నారు. దాంట్లో 92 మంది సురక్షితంగా ఉన్నారని, 20 మంది నైట్ డ్యూటీ వల్ల బయట ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్బీటీసీ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఆ బిల్డింగ్‌లో ఉంటున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిప్రమాదం జరగడం వల్ల.. నిద్రలో ఉన్న కొందరు పొగ ఊపిరి పీల్చుకోలేక మరణించారు. కొందరు భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
#Kuwait Tragedy
41 killed, dozens injured in a fire in Mangaf city
Fire started in a kitchen at six-storey building, housing workers. Firefighters & forensic teams dispatched
Several Indians present. Many deaths reported due to smoke inhalation. More details awaited from the… pic.twitter.com/dMMrJlQ0UM
— Nabila Jamal (@nabilajamal_) June 12, 2024