Punjab minister | పంజాబ్‌లో సీనియర్ అధికారి ఆత్మహత్య.. మంత్రిపై కేసు నమోదు.. పదవికి రాజీనామా
Punjab minister | పంజాబ్‌లో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసు ఆ రాష్ట్ర మంత్రి లల్జీత్ సింగ్ భుల్లర్ మంత్రి పదవిని ఊడగొట్టింది. మంత్రి లల్జీత్ సింగ్ వేధింపుల కారణంగానే ఒత్తిడి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సదరు అధికారి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Punjab minister : పంజాబ్ (Punjab) లో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి గగన్‌దీప్ సింగ్ రంధావా (Gagandeep Singh Randhawa) ఆత్మహత్య కేసు ఆ రాష్ట్ర మంత్రి లల్జీత్ సింగ్ భుల్లర్ (Laljit Singh Bhullar) మంత్రి పదవిని ఊడగొట్టింది. మంత్రి లల్జీత్ సింగ్ వేధింపుల కారణంగానే ఒత్తిడి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సదరు అధికారి తన సూసైడ్ నోట్ (Suicide Note) లో పేర్కొన్నాడు. దాంతో ఆయన భార్య ఉపిందర్ కౌర్ (Upinder Kaur) రంజిత్ అవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు చేసింది. మంత్రి లల్జీత్ సింగ్ భుల్లర్, ఆయన తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ భుల్లర్, మంత్రి పీఏ తన భర్తను శారీరకంగా, మానసికంగా వేధించారని కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ముగ్గురు కలిసి వేధింపులతో తన భర్తను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఉపిందర్ కౌర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దాంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంత్రి లల్జీత్సింగ్ను ఆదేశించారు. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రంధావా ఆత్మహత్య పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
ఈ ఘటనపై ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమని, నిజాయతీపరుడైన అధికారి రాజకీయ వేధింపులకు బలయ్యారని విమర్శించాయి. అయితే ఇవి నిరాధార ఆరోపణలని, రాజకీయ కుట్రలో భాగమని మంత్రి వర్గీయులు ఖండిస్తున్నారు. అధికారి ఆత్మహత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, దోషులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెడతామని సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

