Lok Sabha Elections | రెండో విడుత నోటిఫికేషన్ విడుదల.. 88 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్లు షురూ
సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్ను ఈసీ (EC) విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడుతలో ఔటర్ మణిపూర్లోని ఒక సీటుతోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది.
ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5న జరుగనుంది. జమ్మలో మాత్రం ఏప్రిల్ 6న నామపత్రాలను పరిశీలించనున్నారు. రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. కాగా, మొదటి విడుత నోటిఫికేషన్ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

