న్యూఢిల్లీ: మెట్రో రైలులోని లేడీస్ కోచ్‌లో ఎక్కువ మంది పురుషులు ప్రయాణించారు. మెట్రో రైలు ఒక స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్‌లో ప్రయాణించిన మగవారిని చెంప దెబ్బలతో మహిళా పోలీసులు స్వాగతించారు. (Female Cops Slap Men) లోపల ఉన్న వారిని కూడా దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మెట్రో రైలులోని మహిళా కోచ్‌లోకి పురుషులు ఎక్కువ మంది ఎక్కారు. దీంతో ఇబ్బంది పడిన మహిళలు దీని గురించి ఫిర్యాదు చేశారు.
కాగా, ఆ మెట్రో రైలు ఒక స్టేషన్‌కు చేరగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్‌లో ఉన్న మగవారి చెంపలు, వీపులపై మహిళా పోలీసులు కొట్టారు. లోపల ఉన్న మరి కొందరు పురుష ప్రయాణికులను బలవంతంగా దించివేశారు. దీంతో లేడీస్ కోచ్ చాలా ఖాళీగా కనిపించింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పోలీసుల చర్యను కొందరు సమర్థించగా మరికొందరు తప్పుపట్టారు. మగవారి చెంపలపైనా, భౌతికంగా మహిళా పోలీసులు కొట్టడాన్ని కొందరు ఖండించారు. లేడీస్ కోచ్‌లో ఎక్కిన లేదా ప్రయాణించిన పురుషులను ఇలా చెంపదెబ్బ కొట్టడం ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు.
बहुत अच्छा किया https://t.co/lEIfO9T697
— SawindCA (@CaSawinder) June 20, 2024