న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మానవుల్లో పంది కిడ్నీ మార్పిడికి అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది మధ్యలో తొలి అవయవ మార్పిడి చేపడుతున్నట్టు ‘యునైటెడ్ థెరపాటిక్స్ కార్ప్’ అనే కంపెనీ వెల్లడించింది. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీల మార్పిడిపై క్లినికల్ ట్రయల్స్‌కు ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదం తెలిపింది.
జంతువుల అవయవాల్ని మనుషులకు అమర్చేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. తొలుత మూత్రపిండాల వ్యాధి చివరిదశలో ఉన్న ఇద్దరు పేషెంట్స్‌తో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని, ఆశించిన ఫలితాలు వస్తే, ప్రయోగాలను 50 మంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు విస్తరిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.