Missionaries of Charity | మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రిస్టోర్డ్!
Missionaries of Charity | మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఎఫ్సీఆర్ఏ కింద విదేశీ విరాళాల స్వీకరణ లైసెన్స్‌ను కేంద్రం పునరుద్ధరించింది.

Missionaries of Charity | కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంవోసీ) సంస్థకు కేంద్రం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్‌ను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ (ఎంవోసీ)పై కొన్నిఫిర్యాదులు రావడంతో కొన్ని రోజుల క్రితం దానికి ఎఫ్సీఆర్ఏ లైసెన్సు రద్దు చేసింది. ఎంవోసీ ఇక విదేశీ విరాళాలు స్వీకరించొచ్చని, బ్యాంకుల్లో నిధులు ఖర్చు చేసుకోవచ్చునని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. నిరుపేదలు, అనాధలను ఆదుకునేందుకు 1950లో ఎంవోసీని స్థాపించిన మదర్ థెరిసాకు నోబెల్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద విరాళాల స్వీకరణకు లైసెన్స్ పునరుద్ధరణ జరిగిన విషయమై మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అధికారికంగా స్పందించలేదు. ఈ నెల ఏడో తేదీన తమ ఎఫ్సీఆర్ఏను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించిందని మిషనరీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.ఈ పరిణామం పట్ల తాము ఆనందంతో ఉన్నామని తెలిపారు.
ఎంవోసీ వైఖరి ఇలా
తమ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించలేదని తెలిసినప్పుడు దేశంలోని విరాళాలు, శ్రేయోభిలాషుల అండదండలతో పేదలు, అనాధలకు సేవలను కొనసాగించాలని నిర్ణయించాం అని మిషనరీస్ అధికారి చెప్పారు. నూతన సంవత్సరం ప్రారంభంలోనే తమ లైసెన్స్ పునరుద్ధరణ రిలీఫ్ కలిగించిందన్నారు. డిసెంబర్ 27న ఎంవోసీ ఎఫ్సీఆర్సీ లైసెన్స్ రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే, ఆ సంస్థ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదు. ఎంవోసీ అధికారులే తమ ఎస్బీఐ ఖాతాను ఫ్రీజ్ చేయమని కోరింది.
కేంద్ర హోంశాఖ తీరుపై భగ్గుమన్న విపక్షం
ఎంవోసీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దయిన విషయం బయటికి రావడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు విపక్ష పార్టీలన్నీ భగ్గుమన్నాయి. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. తమ రాష్ట్రంలోని ఎంవోసీ యూనిట్లకు నిధుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వాడుకోవాలని సూచించారు. కొన్ని సంస్థలకు రూ.78 లక్షలకు పైగా నిధులు విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

