న్యూఢిల్లీ : కన్నకొడుకు పెండ్లి వేడుక తల్లితండ్రులకు ఎంతో ప్రత్యేకం..ఆ ఇంట పెండ్లి సందడి మామూలుగా ఉండదు. ఇక కొడుకు పెండ్లిలో తండ్రి హుషారైన మూమెంట్స్‌తో డ్యాన్స్ చేయడం అతిధులందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను కొరియోగ్రాఫర్లు తమ ఇన్స్టాగ్రాం ఖాతా టుగెదర్ అండ్ ఫరెవర్ వెడ్డింగ్ కొరియోగ్రఫీలో షేర్ చేశారు.
View this post on Instagram
A post shared by Together & Forever Wedding Choreography (@togetherforever_wedding_choreo)
ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా వీక్షించారు. వైరల్ వీడియోలో యే జవానీ హై దివానీ మూవీలోని బద్తమీజ్ దిల్ సాంగ్‌కు వరుడి తండ్రి క్రేజీ స్టెప్స్‌తో పూనకాలు తెప్పించారు. ఈ సాంగ్‌కు కిల్లర్ స్టెప్స్‌తో ఊపేయడంతో పాటు తనదైన స్టైల్‌ను జోడించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరి తండ్రి ఇలా ఎంజాయ్ చేయాలని తాను కోరుకుంటున్నానని ఓ యూజర్ రాసుకొచ్చారు. అసలు ఈ పాట అర్ధం ఏంటో తనకు ఇవాళ తెలిసిందని..అంకుల్ డ్యాన్స్‌తో ఇరగదీశాడని మరో యూజర్ కామెంట్ చేశారు.