house demolish | ఇళ్ల కూల్చివేత ఫ్యాషన్‌గా మారిందని హైకోర్టు ఆగ్రహం.. ఒక మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం
house demolish | ఇళ్ల కూల్చివేత (house demolish) ఫ్యాషన్‌గా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: ఇళ్ల కూల్చివేత (house demolish) ఫ్యాషన్‌గా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉజ్జయినీకి చెందిన రాధా లాంగ్రీ అనే మహిళ ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీనిపై ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అధికారులు తప్పుగా తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించింది.
కాగా, న్యాయమూర్తి వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం ఆ మహిళ పిటిషన్‌పై విచారణ జరిపింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక పరిపాలన, స్థానిక సంస్థల అధికారులకు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని విమర్శించింది. క్రమబద్ధీకరించడానికి సరైన అవకాశం ఇచ్చిన తర్వాతే కూల్చివేతను చివరి మార్గంగా ఎంచుకోవాలని సూచించింది.
మరోవైపు సరైన అనుమతి లేకుండా లేదా నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే బాధిత మహిళకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

