అగ్ర హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నాలుగు మిలియన్ల్ల ఫాలోవర్స్‌తో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఏ స్టార్హీరో భార్యకు లేనటువంటి ఫాలోవర్స్‌ను ఆమె సంపాదించుకోవడం విశేషం. తన గారాల సంతానం అయాన్, అర్హలకు సంబంధించిన అందమైన క్షణాల్ని ఫొటోల్లో బంధించి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. అల్లు అర్జున్ సినిమాల తాజా సమాచారాన్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది. వీటితో పాటు అనేక ఇతర అంశాలపై తన స్పందనను వ్యక్తం చేస్తూ స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది.