
ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం (పీబీజీ)లో సేవలందించిన అశ్వరాజం ‘విరాట్’కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసుమీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హనోవేరియన్ జాతికి చెందిన విరాట్.. 2003లో బాడీగార్డ్‌తో చేరింది. ఇప్పటివరకూ 13సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంది. వీడ్కోలు సమయంలో విరాట్ చెంతకు వెళ్లిన రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి రాజ్‌నాథ్ దాన్ని ఆత్మీయంగా నిమిరారు.