Anuradha Paudwal | బీజేపీలో చేరిన గాయని అనురాధ పౌడ్వాల్.. లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచే ఛాన్స్..!
Anuradha Paudwal | ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ శనివారం బీజేపీ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ నుంచి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇన్చార్జి అరుణ్ సింగ్ సమక్షంలో అనురాధ బీజేపీలో చేరారు.
Anuradha Paudwal | ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ శనివారం బీజేపీ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ నుంచి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇన్చార్జి అరుణ్ సింగ్ సమక్షంలో అనురాధ బీజేపీలో చేరారు. అనురాధ పౌడ్వాల్ బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను ఆలపించారు. మరాఠీతోపాటు హిందీ, తమిళం, ఒడియా, నేపాలీ భాషల్లో పాటలు పాడారు. సినిమా పాటలతో పాటు భజనలు, భక్తిగీతాలు ఆలపించి ఎంతో గుర్తింపు పొందారు.
బీజేపీలో చేరడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతనంతో బలమైన అనుబంధం ఉన్న పార్టీలో చేరడం తన అదృష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. తనకు తెలియదన్నారు. కర్నాటకలోని కార్వార్లో జన్మించిన పౌడ్వాల్ 19 ఏళ్ల వయసులో ‘అభిమాన్’ చిత్రంలో ‘ఓంకారం బిందు సంయుక్తం’తో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఈ పాటను ఆర్డీ బర్మన్ స్వరపరిచారు. అనురాధ పౌడ్వాల్ 1983లో ‘హీరో’ చిత్రంలో ‘తు మేరా హీరో హై’తో పాటతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసింది.
అలాగే ‘ఆషికీ’, ‘దిల్ హై కి మంత నహిన్’, ‘బేటా’ చిత్రాల్లో ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. అనురాధ పౌడ్వాల్ ఐదు దశాబ్దాలకుపై సింగర్‌గా కొనసాగుతున్నారు. గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంబాజీ, భోజ్‌పురి, నేపాలీ, మైథిలీ తదితర భాషల్లో 9వేలకుపైగా పాటలు ఆపాడారు. 1,500 కంటే ఎక్కువ శ్లోకాలను రికార్డు చేశారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

