మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్(Meerut Murder) జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు హత్యకు గురయ్యారు. భర్త, భార్య, ముగ్గురు కుమార్తెలు దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. లిసారి గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సోహెల్ గార్డెన్లో ఈ విషాద ఘటన జరిగింది. ఇంట్లోనే అయిదుగురి మృతదేహాలను వెలికితీశారు. భర్త మొయిన్, భార్య అస్మా.. మృతదేహాలు ఇంటి ఫ్లోర్‌పై ఉన్నాయి. ఇక ముగ్గురు కుమార్తెల మృతదేహాలు.. ఓ బెడ్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. పిల్లల శవాలను మంచంలో దాచి పెట్టి.. వారి ఆచూకీ తెలియకుండా చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
మర్డర్ గురించి తెలుసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందాలు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటిని కార్డెన్ చేసి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. క్రైం సీన్‌ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి అయిదుగురు కుటుంబసభ్యుల్ని చంపడం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానిక ప్రజలు షాక్‌లోకి వెళ్లారు. చాలా శాంతియుతంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి హేయమైన ఘటన ఎలా జరిగిందని భావిస్తున్నారు.
మేస్త్రీగా పనిచేస్తున్న మొయిన్ కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేసి ఉంటారని ఆరా తీస్తున్నారు. మర్డర్‌కు చెందిన ఎటువంటి సమాచారం ఉన్నా తమతో పంచుకోవాలని పోలీసులు కోరారు.