ఇంకా అందని ‘నీట్’ పరిహారం
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన 36 రోజుల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మూడు హామీలు ఇచ్చింది. వాటిలో విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి పరిహారం అందజేత, మూడవది నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ. వీటిలో మొదటి హామీ నెరవేరగా, మిగిలిన రెండూ అలానే ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ తర్వాత 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
- మృతుల కుటుంబాల ఆవేదనపై గ్రౌండ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన 36 రోజుల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మూడు హామీలు ఇచ్చింది. వాటిలో విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి పరిహారం అందజేత, మూడవది నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ. వీటిలో మొదటి హామీ నెరవేరగా, మిగిలిన రెండూ అలానే ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ తర్వాత 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
‘దైనిక్ భాస్కర్’ బాధిత కుటుంబాలతో మాట్లాడగా, వారు తమకు ఇంతవరకూ పరిహారం అందలేదని, తమను ఏ అధికారి సంప్రదించలేదని తెలిపారు. ఢిల్లీకి చెందిన అన్షిక నీట్ రద్దయిన పది రోజుల తర్వాత మే 14న ఆత్మహత్యచేసుకుంది. అహ్మదాబాద్‌కు చెందిన కహన్ది. హర్యానాకు చెందిన సిమ్రన్ నీట్ పరీక్ష రద్దుతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన బాధిత కుటుంబాలది కూడా ఇదే పరిస్థితి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పరిహారం కోరుతూ తాము ప్రభుత్వానికి లేఖ రాశామని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందుకే సీజేపీ మళ్లీ రోడ్లపైకి రావాలని నిర్ణయించుకున్నదన్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 5న జంతర్‌మంతర్ నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహిస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

