కిడ్నీలు ఫెయిల్ అంటూ తప్పుడు రిపోర్టులు
బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో అక్రమ బాగోతం వెలుగు చూసింది. పలు పాథాలజీ ల్యాబ్‌లలో అక్రమాలను ‘దైనిక్ భాస్కర్' తన పరిశోధనలో బయటపెట్టింది. ఆరోగ్యంగా ఉన్న కిడ్నీలు, కాలేయం దెబ్బతిన్నట్లు, సాధారణ జ్వరాన్ని డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులుగా చూపిస్తూ తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు, శాంపిల్ కలెక్షన్ ఏజెంట్లు కలిసి ఈ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
- వైద్యులు, ల్యాబ్‌ల మూకుమ్మడి దందా
లక్నో: బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో అక్రమ బాగోతం వెలుగు చూసింది. పలు పాథాలజీ ల్యాబ్‌లలో అక్రమాలను ‘దైనిక్ భాస్కర్’ తన పరిశోధనలో బయటపెట్టింది. ఆరోగ్యంగా ఉన్న కిడ్నీలు, కాలేయం దెబ్బతిన్నట్లు, సాధారణ జ్వరాన్ని డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులుగా చూపిస్తూ తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు, శాంపిల్ కలెక్షన్ ఏజెంట్లు కలిసి ఈ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఓ ల్యాబ్‌లో సాధారణంగా ఉన్న ప్లేట్లెట్స్ సంఖ్యను 1.74 లక్షల నుంచి 1.10 లక్షలకు తగ్గించి రిపోర్టు ఇచ్చారు. అహ్మద్ అన్సారీ అనే నిర్వాహకుడు కిడ్నీ పరీక్షలో సాధారణంగా ఉన్న క్రియాటినిన్ స్థాయిని 0.58 నుంచి 8.1గా మార్చాడు. మరో ల్యాబ్ నిర్వాహకుడు టీఎల్సీ స్థాయిని 15,600గా చూపించాడు. అసలు రిపోర్టులు మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కేజీఎంయూ వంటి ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి రోగులను ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తే ఒక్కొక్కరికిపై రూ.4 వేల కమిషన్ వస్తుందని, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే రోగులతో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వ్యాపారం చేయవచ్చని మరో నిర్వాహకుడు ప్రతిపాదించాడు. రోగులను ఎక్కువ రోజులు దవాఖానాలలో ఉంచి చికిత్స పేరుతో భారీగా వసూలు చేయడమే దీని వెనుక ఉద్దేశమని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

