Fake app | అది ఫేక్ యాప్.. బీ కేర్‌ఫుల్.. బలగాలకు సీఆర్పీఎఫ్ అలర్ట్
Fake app | ఒక ఫేక్ యాప్ (Fake app) విషయంలో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)’ అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్కు చెందిన ప్రామాణిక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉందని తెలిపింది. సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలను తస్కరించేలా ఆ యాప్ ఉందని, అది భద్రతాపరంగా తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Fake app : ఒక ఫేక్ యాప్ (Fake app) విషయంలో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)’ అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్కు చెందిన ప్రామాణిక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉందని తెలిపింది. సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలను తస్కరించేలా ఆ యాప్ ఉందని, అది భద్రతాపరంగా తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మొత్తం 3.25 లక్షల మంది సిబ్బందికి సీఆర్పీఎఫ్ సూచించింది.
‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట ఓ యాప్‌పై వాట్సాప్, యూట్యూబ్ సహా ఆయా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ప్రచారం జరుగుతోందని సీఆర్పీఎఫ్ ఐటీ విభాగం అడ్వైజరీ జారీ చేసింది. ఆ అప్లికేషన్‌ను తాము రూపొందించలేదని, వినియోగానికి కూడా సిఫార్సు చేయలేదని ఓ అధికారి తెలిపారు. ఆన్లైన్ ప్లే స్టోర్ల నుంచి దాన్ని తొలగించాలని ప్రభుత్వ సైబర్ భద్రతాసంస్థలను కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘సీఆర్పీఎఫ్ సంభవ్’ పేరిట అసలైన యాప్ వినియోగంలో ఉంది. బలగాలు, ఇతర సిబ్బంది తమ వేతనాలు, సెలవులు, బదిలీలకు అర్హత వంటి వ్యక్తిగత, అడ్మినిస్ట్రేటివ్ వివరాలను పరిశీలించేందుకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట చక్కర్లు కొడుతున్న నకిలీ యాప్.. సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతూ వారి వివరాలు అడుగుతోందని సీఆర్పీఎఫ్ తన అడ్వైజరీలో పేర్కొంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read More >>
‘ఇది పరిహాసమా.. జిల్లా మొత్తం రాసిస్తున్నారా?’.. అసోం సర్కారుపై గౌహతి హైకోర్టు ఫైర్
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లతో మనిషి విలువను కొలువద్దు : ఐశ్వర్యారాయ్
భారత్-చైనా సరిహద్దులు ప్రశాంతం : అజిత్ దోవల్
మెక్సికో అమ్మాయితో గన్నవరం కుర్రాడి పెళ్లి.. పెళ్లి ఫొటోలు వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

