Anna University : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తు జరిపి నిజనిర్ధారణ చేసేందుకు ‘జాతీయ మహిళా కమిషన్ నియమించిన నిజనిర్ధారణ కమిటీ (NCW fact-finding committee)’ ఇవాళ అన్నా యూనివర్సిటీకి వచ్చి విచారణ జరిపింది. ఉదయం యూనివర్సిటీకి చేరుకున్న కమిటీ సాయంత్రం విచారణ పూర్తిచేసి బయటకు వచ్చింది.
అనంతరం కమిటీ సభ్యురాలు మమతా కుమారి మాట్లాడుతూ.. తాము విచారణ పూర్తిచేశామని, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత నివేదిక జాతీయ మహిళా కమిషన్కు చేరుతుందని, తదనంతరం బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. విచారణలో భాగంగా కమిటీ యూనివర్సిటీ అధికారులను, బాధితురాలిని, బాధితురాలి కుటుంబాన్ని, ఎన్జీవోలను ప్రశ్నించింది.
కాగా, అన్నా యూనివర్సిటీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థినిపై ఈ నెల 23న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనుకవైపు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటచెబితే వీడియో బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
అయినా బాధితురాలు భయపడకుండా తన స్నేహితుడితో కలిసి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని, గతంలో కూడా అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని, అయితే పరువుపోతుందన్న భయంతో ఎవరూ విషయాన్ని బయటికి చెప్పుకోలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
#WATCH | Alleged sexual assault case in Anna University | Chennai, Tamil Nadu: Fact-Finding Committee formed by the National Commission for Women leaves from Anna University
Mamta Kumari, a member NCW fact-finding committee says, ” We have conducted the probe, and the report… https://t.co/KRa9Et2qHy pic.twitter.com/A6KwZAcwww
— ANI (@ANI) December 30, 2024