Fact Check : పాకిస్థాన్ (Pakistan) లోని నన్కానా సాహిబ్ (Nankana Sahib) గురుద్వారా (Gurudwara) పై భారత్ డ్రోన్ దాడికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం (Centrel Govt) శనివారం కొట్టిపారేసింది. భారత్లో మతకల్లోలాలు సృష్టించడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ప్రకటన చేసింది. ‘నన్కిన్ సాహెబ్ గురుద్వారాపై భారత్ డ్రోన్ దాడికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో ఓ తప్పుడు వీడియో ప్రసారమవుతోంది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అది పూర్తిగా తప్పుడు వీడియో. భారత్లో మతకల్లోలాలు సృష్టించడం కోసం కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు’ అని పీఐబీ పేర్కొంది.
నన్కిన్ సాహిబ్ గురుద్వారా సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ జన్మస్థలం. నదీ తీరంలో ఉన్న పవిత్ర గురుద్వారా సిక్కుల ప్రధాన తీర్థయాత్రా కేంద్రాల్లో ఒకటి. అదేవిధంగా యుద్ధవిమానం నుంచి దూకిన ఓ మహిళా పైలట్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పట్టుబడిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా కేంద్రం తోసిపుచ్చింది. పాకిస్థాన్ సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ పనిచేయకుండా పోయిందని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని పేర్కొంది.