న్యూఢిల్లీ, జనవరి 31: ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్ కోర్సుల వ్యాలిడిటీని 2025-26 విద్యా సంవత్సరం వరకు పొడిగిస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. పీహెచ్డీ డిగ్రీకి సంబంధించి యూజీసీ 2022 నుంచి కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, మానసిక ఆరోగ్య సేవల్లో క్లినికల్ సైకాలజిస్టులు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ల ప్రాధాన్యతను గుర్తిస్తూ.. రెండు ఎంఫిల్ కోర్సులకు నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.