Explotion : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఓ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ (Fire crackers factory) లో భారీ పేలుడు (Explotion) సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. శుక్రవారం ఉదయం పశ్చిమబెంగాల్ రాష్ట్రం కళ్యాణి జిల్లా (Kalyani district) రథ్టాలా (Rathtala) లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Nadia, West Bengal | Explosion occurs at an illegal firecracker manufacturing unit in Rathtala, Kalyani, police investigation underway
BJP MLA Ambika Roy says, “Five people including 4 women and a child have died in this painful incident. Many such incidents have been… pic.twitter.com/nuqJvVrlS4
— ANI (@ANI) February 7, 2025
ఈ ఘటనపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ అసహనం వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండం బాధాకరమని అన్నారు. ఘటనా ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పారు. ఇంత మొత్తం పేలుడు పదార్థాలున్న ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ గురించి పోలీసులకు తెలియకుండా ఉండటం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జి పూర్తిగా విఫలమయ్యారని అంబికా రాయ్ విమర్శించారు. తాజా పేలుడు ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాము అసెంబ్లీ లేవనెత్తుతామని చెప్పారు.