Centre Fresh Advisory | ‘ఇరాన్ నుంచి వెంటనే బయటపడండి’.. భారత పౌరులకు కేంద్ర తాజా అడ్వయిజరీ
Centre Fresh Advisory | ఇరాన్ (Iran) దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి కీలక అడ్వైజరీ జారీచేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్ (X)' వేదికగా పోస్టును పంచుకుంది.
Centre Fresh Advisory : ఇరాన్ (Iran) దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి కీలక అడ్వైజరీ జారీచేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్ (X)’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.
ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావద్దని హెచ్చరించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు ఇచ్చింది. +989128109115, +989128109109, +989128109102, +989932179359, మెయిల్ ఐడి – cons.tehran@mea.gov.in ను షేర్ చేసింది.
అమెరికా, ఇరాన్ దేశాలు గత రాత్రి రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలో నిన్న కూడా కేంద్రం ఒక అడ్వయిజరీ జారీచేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్థుల భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇప్పుడు కాల్పుల విరమణ నేపథ్యంలో తాజాగా మరో అడ్వైయిజరీ జారీచేసింది. ఇరాన్‌ను వెంటనే వీడాలని తాజా అడ్వయిజరీలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

