New Study : వ్యాయామం శారీరక ఆరోగ్యానికే కాకుండా మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కండరాలను ఉత్తేజపరిచే నరాలు మెదడును ప్రేరేపించే కారకాల విడుదలను పెంచుతాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. కండరాల నుండి విడుదలయ్యే అణువులు రక్తప్రవాహంలోకి వెళ్లి అక్కడినుంచి మెదడుకు చేరుకుని కండరాలు, మెదడు మధ్య క్రాస్స్టాక్ అని పిలిచే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి.
కండరాల కార్యాచరణపై న్యూరాన్ల ప్రభావం, కండరాలు, మెదడు మధ్య కమ్యూనికేషన్ పట్ల తాము ఆశ్చర్యపోయే ఫలితాలు గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన హ్యుంజున్ కాంగ్ తెలిపారు. ఈ అధ్యయన వివరాలు నేషనల్ అకాడమ ఈ ఆఫ్ సైన్సెల్లో ప్రచురితమయ్యాయి. మనం వయసు మీరే కొద్దీ లేదా వ్యాధులు, గాయాల బారినపడటం మూలంగా కండరాల్లో ఈ న్యూరాన్లను కోల్పోతాం..వయోవృద్ధులు, నరాలు, కండరసంబంధిత సమస్యలున్న రోగుల్లో వీటి పాత్ర కీలకమని వెల్లడైందని చెప్పారు.
వ్యాయామం చేయడం ద్వారా స్రవించే హార్మోన్లు మెదడు కణాల కనెక్టివిటీ, కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి. కండరాలను ఉత్తేజపరిచే నరాల పాత్రను మనం పరిమితంగా అర్ధం చేసుకుకున్నామని అధ్యయనం తొలి రచయిత, గ్రాడ్యుయేట్ విద్యార్థి కై-యు హువాంగ్ వివరించారు.వ్యాయామం న్యూరాన్-కండరాల ఇంటర్ఫేస్ను బలపరుస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంపొందించడం కంటే వ్యాయామం ద్వారా ఈ కనెక్షన్‌ను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను అధ్యయన వివరాలు ప్రముఖంగా వెల్లడించాయని కాంగ్ పేర్కొన్నారు.
Read More :
PhonePe | భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్.. శ్రీలంకలో ఫోన్‌పే సేవలు..!