66 ఏండ్లపాటు పింఛన్ తీసుకున్న వృద్ధుడు కన్నుమూత..
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్ (100) కన్నుమూశారు.
జైపూర్: అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్ (100) సోమవారం కన్నుమూశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్ అందుకున్నారు. బోయత్‌రామ్ తన 17 ఏండ్ల వయస్సులో ఆర్మీలో జాయిన్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో లిబియా, ఆఫ్రికాలో పనిచేశారు.
కాగా, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదేండ్లకు అంటే 1957లో ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ప్రతినెల పెన్షన్ అందుకుంటున్నారు. 1957లో రూ.19 తో ప్రారంభమైన పింఛన్.. ఆయన మరణించేనాటికి రూ.35,640కి చేరింది. ఇప్పుడు ఆయన సతీమణి చందా దేవి సైనా (92) తాను బతికున్నంత కాలం పెన్షన్ అందుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

