ముంబై : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గురువారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నేత బాబా సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో 48 ఏండ్ల అనుబంధానికి తెరపడిందని సిద్ధిఖి పేర్కొన్నారు.
తాను టీనేజర్‌గా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో అడుగుపెట్టానని 48 ఏండ్ల సుదీర్ఘ ప్రస్ధానాన్ని ముగిస్తూ తక్షణమే ఆ పార్టీ నుంచి వైదొలగుతున్నానని, ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నా అయితే కొన్ని విషయాలను వెల్లడించకుండా వదిలివేయడమే మేలని ట్విట్టర్ వేదికగా సిద్ధిఖి రాసుకొచ్చారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో సిద్ధిఖి చేరవచ్చని భావిస్తున్నారు. సిద్ధిఖితో పాటు ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ ఫిబ్రవరి 1న అజిత్ పవార్‌ను కలవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Read More :