సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం సమోసాలపై రాజకీయం జరుగుతున్నది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ పాల్గొన్న సీఐడీ కార్యక్రమంలో ఆయన కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. అవి ఆయన భద్రతా సిబ్బందికి చేరాయి. దీంతో సీఎం కేవలం టీతో సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సమోసాల మాయం గందరగోళంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది.
కాగా, ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన బీజేపీ ఈ సమోసా వివాదంపై మండిపడింది. సీఎం కోసం ఉంచిన సమోసాలు కాపాడలేని వారు ప్రజలను ఎలా కాపాడతారని విమర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జైరాం ఠాకూర్ శుక్రవారం బీజేపీ నేతలు, కార్యకర్తలకు సమోసా పార్టీ ఇచ్చారు. సీఎం సుఖ్విందర్ సుఖ్ను ఎగతాళి చేసేందుకు ఈ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు సమోసాలను తింటూ వాటిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Mandi: Amid the ‘samosa’ controversy, Former Himachal Pradesh CM and LoP Jairam Thakur organises a samosa party with BJP workers at the Circuit House in Mandi.
(Source: Jairam Thakur Office) pic.twitter.com/wq1rrm57X0
— ANI (@ANI) November 8, 2024