ఇంధన స్విచ్‌లో లోపం.. ఎయిరిండియా విమానం నిలిపివేత
లండన్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లో లోపం బయటపడింది. ఆ విమానానికి చెందిన పైలట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో లోపాన్ని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది! దీంతో బోయింగ్ 787-8 విమాన ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసినట్టు ‘ఎయిరిండియా’ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
- పైలట్ ముందే గుర్తించటంతో తప్పిన పెను ప్రమాదం!
- ఇలాంటి పరిస్థితి తలెత్తడంతోనే అహ్మదాబాద్ విమాన దుర్ఘటన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: లండన్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లో లోపం బయటపడింది. ఆ విమానానికి చెందిన పైలట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో లోపాన్ని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది! దీంతో బోయింగ్ 787-8 విమాన ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసినట్టు ‘ఎయిరిండియా’ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్యను విమాన తయారీదారు బోయింగ్ కంపెనీకి తెలియజేశామని, బోయింగ్‌తో కలిసి సమస్యసు పరిశీలిస్తున్నట్టు ఎయిరిండియా పేర్కొన్నది.
తాజా ఈ ఘటన.. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనను గుర్తుచేసింది. ఆనాటి విమాన ప్రమాదానికి ‘ఫ్యూయల్ స్విచ్’లే కారణమని పలు నివేదికలు పేర్కొన్నాయి. తాజా ఘటన వివరాలను డీజీసీఏకు తెలియజేశామని, డీజీసీఏ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. తాము నడుపుతున్న ‘బోయింగ్ 787’ అన్ని విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్‌లను తనిఖీ చేశామని ఎయిరిండియా తెలిపింది. అందులో ఎలాంటి సమస్యలూ బయటపడలేదని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

