Encounter | చత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్ : అటవీ ప్రాంతంలో కాల్పుల హోరు
చత్తీస్‌ఘఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్‌కు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
రాయ్‌పూర్ : చత్తీస్‌ఘఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్‌కు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఎన్కౌంటర్లో ఓ మహిళా నక్సల్ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈనెల 7న బిజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎన్కౌంటర్ జరిగిన అనంతరం మరోసారి నక్సల్స్, పోలీసులు తలపడ్డారు.
7న జరిగిన ఘటనలో కోబ్రా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా నక్సల్స్‌ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో చత్తీస్‌ఘఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు వినిపించాయి.
ఇక జూన్ 5న సుక్మా జిల్లాలో కరుడుగట్టిన నక్సల్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సుర్పంగుడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సునీల్ అలియాస్ సోది దేవను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయని సుక్మ ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
Read More
Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

