Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు ఇటీవల హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఆయన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ చర్యకు పాల్పడింది పూణెకు (Pune Techie) చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా గుర్తించారు. ఈ మేరకు సోమవారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. 14వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
శరద్ పవార్ (Sharad Pawar)ను చంపేస్తామంటూ రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చాయి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్కు పట్టిన గతే శరద్ పవార్‌కూ పడుతుందని హెచ్చరించాడు. 2013లో నరేంద్ర దభోల్కర్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపినట్టే.. పవార్ ను కూడా చంపుతారని పోస్ట్ చేశారు. బెదిరింపుల ఘటనపై స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read..
Cyclone Biparjoy | ముంబై ఎయిర్‌పోర్టుపై బిపర్జోయ్ ఎఫెక్ట్.. ప్రయాణికుల ఇబ్బందులు
Warkaris | పూణెలో ఉద్రిక్తత.. వార్కారీ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్