Manipur Violence | మణిపూర్‌లో ఓ వైపు తిండిలేక ప్రజల అవస్థలు.. మరోవైపు ఫోన్ చేస్తే చిటికెలో డ్రగ్స్ సరఫరా
మణిపూర్‌లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.
- డ్రగ్స్ వ్యాపారంలో బీజేపీ నేతలు
Manipur Violence | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 11: మణిపూర్‌లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది. జాతుల మధ్య చిచ్చుపెట్టిన బీజేపీ నేతలు యథేచ్చగా తమ డ్రగ్స్ దందాను నడుపుకొంటున్నారు. ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ దీనిపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.
డీజీపీ కార్యాలయం సమీపంలోనే…
రాజధాని ఇంఫాల్‌లోని బాబూపారా ప్రాంతాన్ని ఇటీవల ఓ విలేకరి సందర్శించారు. అక్కడ ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తూ డ్రైవర్‌తో మాటలు కలిపి డ్రగ్స్ కావాలని అడిగారు. రూ.1200లకు బ్రౌన్ షుగర్, రూ.500లకు ఇంజెక్షన్ ఇస్తారని, పది నిమిషాల్లో తెచ్చిచ్చాడు. ఈ ప్రాంతానికి సమీపంలోనే డీజీపీ కార్యాలయం, బీజేపీ కార్యాలయం ఉన్నప్పటికీ ఆ విలేకరి బస చేసిన హోటల్‌కు దర్జాగా మత్తు పదార్థాలను క్యాబ్ డ్రైవర్ తీసుకురావడం గమనార్హం. డ్రగ్స్‌తో పాటు బ్యాక్ డోర్లో స్పా సేవలు కూడా దొరుకుతాయని డ్రైవర్ చెప్పాడు. మయన్మార్ సరిహద్దుకు 60 కి.మీ దూరంలోనే ఉన్న చురాచాంద్‌పుర్ డ్రగ్స్ వ్యాపారానికి అడ్డాగా మారింది. మయన్మార్ సరిహద్దులో 90 శాతం వరకు కంచెను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ మార్గంలో యథేచ్చగా డ్రగ్స్‌ను సరిహద్దులను దాటించి భారత్‌లోకి తీసుకొస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు 2018లో ప్రారంభించిన ‘వార్ ఆన్ డ్రగ్స్’ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
బీజేపీ నేతను విడిచిపెట్టాలని సీఎం ఒత్తిడి
మణిపూర్ పోలీసు అధికారి థౌనాఓజమ్ నేతృత్వంలో 2018లో హై ప్రొఫైల్ డ్రగ్ మాఫియా నాయకుడు లుహఖోసీ జోవూ భారీ మొత్తంలో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని విడిచిపెట్టాలంటూ సీఎం బీరేన్ సింగ్ తమపై ఒత్తిడి చేసినట్టు పోలీసులు మణిపూర్ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. సీఎం స్వయంగా తనకు వాట్సాప్ కాల్ చేసి ఆ మాఫియా లీడర్‌ను విడిచిపెట్టాలని ఆదేశించినట్టు పోలీసు అధికారి థౌనాఓజమ్ ఆరోపించారు. మరో బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్ మేనల్లుడు ఓర్పామ్ హెన్రీ సింగ్ భారీగా డ్రగ్స్ కలిగి ఉండగా సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరి కేసు నుంచి తప్పించుకున్నారు.
మరో 5 రోజులు ఇంటర్నెట్ బంద్
మణిపూర్‌లో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లు జరిగే ఆస్కారం ఉండటంతో ఇంటర్నెట్ సేవల బంద్ ఇంకా కొనసాగుతున్నది. తాజాగా మరో ఐదు రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆదివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా… వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా జిల్లాల్లో భద్రతా బలగాలు మోహరించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP Leaders
- cbi
- drug trade
- drugs
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

