భోపాల్: మధ్యప్రదేశ్లోని రైసెన్లో ఉన్న సోమ్ లిక్కర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 60 మంది బాల కార్మికులకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) విముక్తి కల్పించింది. ఇక్కడ బాలల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో, ఎన్సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మికంగా ఈ డిస్టిలరీలో తనిఖీలు నిర్వహించారు. 60 మందికిపైగా బాలలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారని వెల్లడైంది. వీరిలో 20 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు గుర్తించారు. వీరందరి శరీరంపైనా రసాయనాల ప్రభావంతో ఏర్పడిన భయానక గాయాలను గమనించారు.