న్యూఢిల్లీ, నవంబర్ 4: ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్ఏఐ’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ ఇటీవల తన తొలి ఏఐ చాట్‌బాట్ మాడల్‌ను ఆవిష్కరించింది. ‘చాట్ జీపీటీ’కి పోటీ గా ‘గోర్క్’ అనే పేరుతో ఆవిష్కరించిన ఈ మాడల్‌ను కేవలం కొద్ది మందికి మాత్రమే అందు బాటులోకి తెచ్చింది.
దీన్ని ఉపయోగించి ఎలాన్ మస్క్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఓ చాట్‌బాట్ ప్రివ్యూను షేర్ చేశారు. దీన్ని పరిశీలిస్తే ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని ‘చాట్ జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘పామ్’ మాదిరిగా ‘గోర్క్’ కూడా ఓ భారీ లాంగ్వేజ్ మాడల్ అని స్పష్టమవుతున్న ది. ‘ఎక్స్’ ద్వారా ‘గోర్క్’ రియల్-టైమ్ సమాచార అనుసంధాన తను కలిగి ఉంటుందని, ఇది ఇతర లాంగ్వేజ్ మాడళ్ల కంటే ఎంతో సానుకూల మైనదని మస్క్ తెలిపారు.