DK Suresh | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. మాజీ ఎంపీ సురేశ్‌ను జూన్ 19న విచారణకు హాజరు కావాలని.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వాంగ్మూలం నమోదు చేయాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో ఐశ్యర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. అనేక మంది హై ప్రొఫైల్ రాజకీయ నాయకులతో ఆమెకు సాన్నిహిత్యం ఉందని తేలింది. ఆ మహిళ అనేక మంది హై ప్రొఫైల్ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉందని చెప్పుకుందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక మొత్తంలో రాబడిని ఎరవేసి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. డీకే సురేశ్ పేరును ఉపయోగించుకుందని.. అతని సోదరిని అని చెప్పుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎంపీ సైతం బెంగళూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులకు కూడా తన పేరు దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా కులకర్ణి వాంగ్మూలాన్ని సైతం ఈడీ నమోదు చేసింది. ఐశ్వర్య గౌడ, ఆమె భర్త హరీశ్ కేఎన్‌తో పాటు పలువురిపై వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లపై ఈడీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నది.