న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) ఉల్లంఘన కేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆయన కుమారుడు రనీందర్ సింంగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీచేసిన కొన్ని రోజులకే జలంధర్‌లో పనిచేస్తున్న ఈడీ అదనపు డైరెక్టర్ దినేశ్ పచౌరీ చెన్నైకి బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో అదనపు డైరెక్టర్ రవి తివారీ నియమితులయ్యారు. గురువారం విచారణకు హాజరుకావాలని రనీందర్ సింగ్‌కు సమన్లు జారీ కాగా శుక్రవారం హాజరుకావాలని అమరీందర్‌కు నోటీసు అందింది. కాగా, వీరిద్దరూ ఈడీ విచారణకు గైర్హాజరు కావడం గమనార్హం. ఇద్దరు బీజేపీ కీలక నాయకులకు సమన్లు జారీ అయిన సమయంలో తివారీ బదిలీ కావడం ఆయన చర్యలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా చూడాల్సి ఉంటుంది.