కోల్‌కతా: బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంటిపై చేసిన సోదాల్లో రూ.40 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు, ఒక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు శనివారం తెలిపారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి బిర్భూమ్ జిల్లా బోల్పూర్లోని మంత్రి నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు జరిపింది.
మంత్రి సోదరుడి కేసులోనూ….
మరోవైపు బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ సోదరుడు, టీఎంసీ నేత స్వరూప్ బిశ్వాస్కు చెందిన ప్రాంగణాలలో ఐటీ శాఖ దాడులు శనివారం ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను ఎగవేత, తదితర ఆరోపణలతో బుధవారం సోదాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4న విచారణకు రావాలని స్వరూప్‌కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.