రూ.7.27 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. వీటిలో రూ7.12 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్, రూ.15 లక్షలు నగదు ఉన్నాయి.
జాక్వెలిన్‌కు సుకేశ్ రూ.5.71 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా రూ.1.4 కోట్ల మేర డబ్బు జాక్వెలిన్ కుటుంబసభ్యులకు అందిందని తెలిపారు. ఈ కేసులో జాక్వెలిన్ ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.