న్యూఢిల్లీ, జూన్ 6: మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ నివాసంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. కేసులో దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈడీ ఇప్పటికే సత్యేందర్ జైన్‌కు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కాగా, బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులో జైన్‌ను ఇరికించిందని, త్వరలోనే ఆయన క్లీన్చిట్ పొంది బయటకు వస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.